Home News ఎన్టీఆర్ రామారావు 95వ జయంతి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానుల సందడి

ఎన్టీఆర్ రామారావు 95వ జయంతి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానుల సందడి

306
0
SHARE

మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు 95వ జయంతి పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ అభిమానుల తాకిడితో సందడిగా మారింది. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్‌ను సందర్శించి ఎన్టీ రామారావును స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తన ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కలిసి ఘాట్‌ను సందర్శించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఈ రోజు అన్నగారి 95వ పుట్టినరోజు, ఆంధ్రరాష్ట్రానికి ఒక పండగ రోజు.

ప్రతి ఇంట ఒక బిడ్డకావాలి, ఆ బిడ్డ ఒక రామారావు లాగా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఆయనంతటి మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకునే పర్వదినం నేడు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే తరాలు చాలవు, యుగాలు చాలవు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బావుండాలి, ఇరు ప్రాంతాల వారు బావుండాలి, సుఖంతా బ్రతకాలి, పేద బడుగు బలహీన వర్గాల వారు బావుండాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్” అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన దాదాపు అందరూ ఘాట్‌ను సందర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here