Home News పవన్ కళ్యాణ్ కు పూర్తీ మద్దతు తెలుపుతున్న కత్తి మహేష్ !

పవన్ కళ్యాణ్ కు పూర్తీ మద్దతు తెలుపుతున్న కత్తి మహేష్ !

174
0
SHARE

“ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను” అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ పవన్‌ కళ్యాణ్ పై విమర్శల వర్షం కుర్పించిన మహేష్ఇ ప్పుడిలా ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని వార్తలు బయటకి వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ప్రెస్‌మీట్‌లో ఎం మాట్లాడతాడో ఎదురు చూడాలి.

కాగా, ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఈ విషయమై ఆందోళన చేపడుతున్నారు. ఇంకోవైపు వైసీపీ ఎంపీలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కత్తి మహేష్ మాత్రం పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని.. తన పూర్తి మద్దతు పవన్‌కే అని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here